![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -354 లో..... రామ్ ని చూడడానికి రామలక్ష్మి వస్తుంది. ఎందుకు వచ్చారని శ్రీలత అడుగుతుంది. రామ్ కి జ్వరం అని తెలిసి చూడడానికి వచ్చానని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు రామ్ కి ఎలా ఉందని రామలక్ష్మి సీతాకాంత్ ని అడుగుతుంది. ఇప్పుడు కొంచెం పర్లేదని సీతా చెప్తాడు. ఒకసారి నేను రామ్ ని చూడాలని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. ఈ మైథిలి బావగారి కోసం వచ్చిందా లేక బాబు కోసం వచ్చిందా అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది.
రామలక్ష్మిని చూడగానే రామ్ కోపంగా మొహం తిప్పుకుంటాడు. మీరు నన్ను తిట్టారని రామ్ అంటాడు. నేను నీ కోసం బోలెడు చాక్లెట్లు తెచ్చాను ఆడుకోవాలని వచ్చానని రామలక్ష్మి అంటుంటే.. అవునా సరేనని రామ్ మాములు అయిపోతాడు. ఫ్రెష్ అయి రా భోజనం రెడీ చేస్తానని రమ్య అంటుంది. ఆ తర్వాత నాన్న అంటూ సీతాకాంత్ ని రామ్ పిలుస్తుంటాడు. ఇక్కడే ఉన్నారు సమాధానం చెప్పకుండా అలా ఉన్నారని శ్రీలతని రామ్ అనగానే.. ఏంట్రా నాన్న అంటున్నావ్.. వాడు నీకు మేనమామ అంతే.. పుట్టగానే తల్లిని, నా కూతురిని పొట్టన పెట్టుకున్నావు. వాడిని నువ్వు నాన్న అని పిలవడం వల్లే వాడికి పెళ్లి అవ్వడం లేదు. ఇంకోసారి అలా పిలిచావో నీ సంగతి చెప్తానని రామ్ పై శ్రీలత కోప్పడుతుంది. మరొకవైపు రమ్య కిచెన్ లో వంట చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి హెల్ప్ చేస్తుంది. మీరెవరని రమ్యని రామలక్ష్మి అడుగుతుంది. సీతా సర్ మోటివేషన్ వల్ల ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యాను.. సర్ ఛాన్స్ ఇస్తే తన లైఫ్ లోకి వెళ్ళాలనుకుంటున్నానని రమ్య అనగానే.. సీతా సర్ తన వైఫ్ జ్ఞాపకాలతో ఉన్నాడు.. మీరు అత్యాశ పడకండి అని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రమ్య, రామలక్ష్మి లు భోజనం చేయమని రామ్ ని పిలుస్తుంటే.. రామ్ సిరి ఫోటో దగ్గర ఏడుస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి, రమ్య, సీతాకాంత్ లు ఏమైందని అడుగుతారు. దాంతో ఏడుస్తూ రామ్ మళ్ళీ బయటకి వస్తాడు. నాకు చెప్పు ఏం జరిగిందో అని రామలక్ష్మి అడుగగా శ్రీలత అన్న మాటలు మొత్తం చెప్తాడు. దాంతో కోపంగా రామలక్ష్మి రామ్ ని తీసుకొని శ్రీలత దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |